ప్రజల కోసం తాను కూలీ మాదిరిగా కష్టం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయితీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు. ప్రజలకు కష్టం వస్తే తాను అండగా ఉంటానని, పదవి అనేది తనకు అలంకారం కాదని, బాధ్యతగా ఉంటానని చెప్పుకొచ్చారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే సత్తా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి మాత్రమే ఉంది అన్నారు. తనకంటే బాగా ఆలోచించే వారి వెంట నడిచేందుకు తాను ఎన్నడూ సంకోచించను అన్నారు పవన్. పాలనానుభవం ఉన్న చంద్రబాబు దగ్గర తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. మైసూరువారి పల్లె పంచాయితీకి 10 సెంట్ల స్థలం అందించిన రైతు కారుమంచి నారాయణను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు.   

error: Content is protected !!