వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం.. తమిళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచే సినిమాగా, కంగువకు తిరుగులేని క్రేజ్ ఉంది.అందుకు తగ్గట్లే ఈ సినిమా తమిళ నాట కనీ వినీ ఎరుగని రీతిలో వ్యాపారాన్ని చేస్తోంది. ఈ మధ్య కాలంలో భారీ విజయం లేకపోయినా, కంగువ అవుట్ పుట్ చూసి, ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు అన్ని ఏరియాల్లో పోటీ కనిపిస్తోంది.ఇక అసలు విషయానికి వస్తే, నిన్నటి వరకు అక్టోబర్ 10న కంగువ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్న సూర్య, ఇప్పుడు సడన్ గా పోస్ట్ పోన్ రూమర్ ను బయటికి ఎందుకు వదిలాదు అంటే, సెంటిమెంట్ కోసమే అని ప్రచారం సాగుతోంది.ఎంత సెంటిమెంట్ కోసమైతే మాత్రం, రిలీజ్ కు రెడీగా ఉన్న చిత్రాన్ని ఇప్పుడు వాయిదా వేస్తారా అంటారా?అంటే అవుతునే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా అంటే చెప్పిన టైమ్ ఎప్పుడైనా వచ్చిందా..? ఈ ఏడాది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి, మొదట జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతకు ముందు ప్రభాస్ నటించిన సినిమా ఏది కూడా చెప్పిన టైమ్ కు రిలీజ్ కాలేదు. సూపర్ హిట్ మూవీ సలార్ కూడా అంతే.. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన చిత్రం సలార్. కాని డిసెంబర్ లో విడుదలైంది. భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక దేవర కూడా అంతే.. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర సెప్టెంబర్ లోకి విడుదల తేదీని మార్చుకున్నాడు. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన పుష్ప 2, డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కంగువ కూడా ఇదే దారిలో వాయిదా పడిందని, వఅక్టోబర్ 10న రావాల్సిన సినిమా, దీపావళి వరకు ఆగాల్సి వస్తోందని తమిళ నాట బాగా ప్రచారం సాగుతోంది. సెంటిమెంట్ న్యూస్ పక్కన పెడితే,కంగువ పోస్ట్ పోన్ కావడానికి అసలు కారణం ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడమే అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అక్టోబర్ 10 నుంచి కంగువ పోస్ట్ పోన్ అయితే మాత్రం, రజనీకాంత్ కొత్త చిత్రం వేట్టాయన్ సోలో రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్లే లెక్క.