మహారాష్ట్ర తీరప్రాంత జిల్లా సింధుదుర్గ్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం, ఏర్పాటు చేసిన 8 నెలలకే కుప్పకూలింది. 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మార్వాన్ లోని రాజ్ కోట్ లో ఆవిష్కరించారు. ప్రధాని ఆవిష్కరించిన విగ్రహం ఏడాదైనా కాకుండానే కుప్పకూలడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని దుయ్యబట్టాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాత్రం భారీ ఈదురు గాలుల వల్లే విగ్రహం కూలిపోయిందని చెప్పుకొస్తున్నారు. వెంటనే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విగ్రహ నిర్మాణ సంస్థ పై కేసు నమోదు చేశామన్నారు.
ఇవి కూడా చదవండి..