దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ క్రెటా నుంచి, ఈవీ వర్షన్ ను లాంఛ్ చేయబోతోంది. జనవరి 17న జరగబోతున్న భారత్ మొటిలిటీ ఎక్ ఫో 2025లో క్రెటా ఈవీని కంపెనీ విడుదల చేయనుంది. ఈవీ సెగ్మెంట్ లో ఇప్పటికే రూలింగ్ లో ఉన్న టాటా కర్వ్, మహింద్రా బీఈ6, ఎంజీ జెడ్ ఎస్ ఈవీలకు క్రెటా ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. హ్యుందాయ్ నుంచి వస్తోన్న మూడో ఈవీ మోడల్ ఇది. రెండు రకాల్లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 20 లక్షల నుంచి 30 లక్షల లోపు కారు ధర ఉండే అవకాశం ఉంది. దీంట్లో 51.4 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన మోడల్ సింగిల్ చార్జింగ్ తో 473 కిలో మీటర్లు మైలేజీ ఇవ్వనుండగా, 42 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మోడల్ 390 కిలోమీటర్లు ప్రయాణించనుంది.

-క్రెటా నుంచి ఈవీ వర్షన్.. అదిరిపోయిన ఫీచర్స్ డీటైల్స్ చూద్దామా

-సింగిల్ చార్జింగ్ తో 473 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

-కేవలం 7.9 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనుందని కంపెనీ చెప్పుకొస్తోంది.

-వాయిస్ తో పానోరామిక్ సన్ రూఫ్ కంట్రోల్ చేయవచ్చు.

-ఆరు ఎయిర్ బ్యాగ్ లు, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ కీ వంటి ఫీచర్స్ క్రెటా ఈవీలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

-కేవలం 58 నిముషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ చార్జింగ్ మరో స్పెషాలిటీ.

-ఈ కారు పై 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వ్యారెంటీ కల్పిస్తోంది కంపెనీ.

error: Content is protected !!