
ఇది మెగా వెబ్ సైట్ కాదు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తోన్నది కాదు. దిల్ రాజు పాజిటివ్ గా రివ్యూ చెప్పమని, డబ్బులు కూడా ఫోన్ పే చేయలేదు. ఉన్నది ఉన్నట్లు… మాకు కరెక్ట్ అనిపించింది మాత్రమే, ఇక్కడ రాస్తుంటాం. గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ కు ముందు వరకు, ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు. తమన్ అందించిన సాంగ్స్ సోసోగా ఉన్నాయి. అంతకు ముందు శంకర్ కూడా సరైనా ఫామ్ లో లేకపోవడం, రామ్ చరణ్ ఆచార్య లాంటి ఫలితాన్ని చూసి ఉండటం, రీజన్ ఏదైనా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం, ఈ పరిస్థితి మారిపోయింది. శంకర్ కమ్ బ్యాక్ అని కోలీవుడ్ మురిసిపోతోంది. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని ట్రైలర్ ద్వారా అర్ధమవుతోందని టాలీవుడ్ ఆనంద పడుతోంది. ఇది రొటీన్ పొలిటికల్ డ్రామానే అయి ఉండవచ్చు, లేదా శంకర్ మూడేళ్లు తీసింది ఇంతేనా అనుకోవచ్చు. కాని ట్రైలర్ లో మాత్రం శంకర్ రేంజ్ కనిపించింది. వావ్ ఫ్యాక్టర్ బయటికి వచ్చింది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపించింది. చరణ్ కనిపించిన ప్రతీసారి ఫ్రేమ్ ఎరప్ట్ అయింది. ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టే, జనవరి 10న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ప్రైడ్ తెలుగు ( PrideTelugu) భావిస్తోంది. సినిమా రిలీజైన రోజున, రివ్యూతో మిగితా విషయాలు మాట్లాడుకుందాం.