చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుడటం, ఇండియాలో పరిస్థితులపై, ఎవరు భయపడాల్సిన పనిలేదని డీజీహెచ్ ఎస్ ఉన్నతాధికారి, డాక్టర్ అతుల్ గోయల్ రిక్వెస్ట్ చేసారు. శీతలకాలం కావడంతో, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. చైనాలో హెచ్ ఎం పీవీ వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తోన్‌ నేపథ్యంలో, ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారి డేటాను విశ్లేషించామని, అయితే భయపడాల్సినంత పరిస్థితులు ఏం లేవని చెప్పుకొచ్చారు గోయల్.  పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేసారు. అయితే శ్వాసకోస ఇన్ఫెక్షన్ల నుంచి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్నారు. దగ్గు, జలుబు ఉన్న వారు ఇంటి వద్దే ఉంటూ మందులు వాడాలని, అలాగే జలుబు, జ్వరం ఉన్నప్పుడు అందుకు తగ్గ వైద్యం తీసుకోని జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితి గురించి, చైనా వైరస్ గురించి మన దేశంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.

error: Content is protected !!