
న్యూ ఇయర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రానే వచ్చింది. కొద్ది గంటల క్రితం జపాన్ లో రిలీజైన కల్కి చిత్రం, అక్కడ సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి, వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే టాక్‌ను జపాన్ లో సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్లాలి అనుకున్నాడు. కాని కాలి గాయం కారణంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. అదే సమయంలో జపానీయులకు జపాన్ భాషలో సినిమా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడు. ఇప్పుడు సినిమా జపనీయులకు నచ్చడంతో, త్వరలోనే రెబల్ జపాన్ వెళ్తాడేమో చూడాలి. జపాన్ లో ప్రభాస్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బాహుబలి చిత్రాలతో వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అది. ఇప్పటికే జపాన్ లో త్రిబుల్ ఆర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు కల్కి జపాన్ లో ఏ స్థాయి హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. మరో వైపు ప్రభాస్ నటిస్తోన్న రాజా సాబ్ వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
