ఈ ఏడు తమిళ సినీ పరిశ్రమ తీసుకొచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో, సత్యం సుందరం ఒకటి. మానవ సంబంధాలను ఎంత అందంగా తెరకెక్కించాడో దర్శకుడు ప్రేమ్ కుమార్. ఇందులో అరవింద్ స్వామి, కనిపించిన ఇల్లు చాలా మంది ప్రేక్షకులను అబ్బురపరిచింది. జీవితాన్ని కొత్తగా పరిచయం చేసింది. ముఖ్యంగా ఇంటి టెర్రస్ పై రామ చిలుకులకు అరవింద్ స్వామి ఆహారాన్ని అందించే సన్నివేశం ..చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి, ఈ ఇల్లు, రామచిలుకలు ఇప్పుడు చాలా పాపులర్ అయాయి. చెన్నైలో ఉంటున్నాడు ఈ ఇంటి యజమాని. పేరు సుందర్శన్ సాహ్. అతని సతీమణి పేరు విద్య.
సుదర్శన్ ను ప్యారెట్ మెన్ ఆఫ్ చెన్నై అని కూడా పిలుస్తారు. సత్యం సుందరం సినిమా రిలీజైనప్పటి నుంచి వీరి ఇల్లు టూరిస్ట్ స్పాట్ గా మారింది. దాంతో సుదర్శన్ రోజుకు 25 మందికి తన ఇంటి టెర్రర్స్ కు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. అది కూడా ఫ్రీగా వెళ్లవచ్చు. కాకపోతే సాయంత్రం 4.30ని.లకు వరకే అక్కడికి చేరుకోవాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సంచలనం సృష్టించలేకపోవచ్చు. కాని ఓటీటీలో రిలీజైన తర్వాత ఎంతో మంది హృదయాలను గెల్చుకుంది. మంచి పాత్రలు, మంచి సంగీతం, మంచి కథ అంటూ ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులు. ఒక్క సీన్ లో కూడా అసభ్యతకు తావు లేకుండా ప్రేమ్ కుమార్ ఈచిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా గొప్పగా ఉంది. ఈ విషయంలో ఆయన్ని ఎంత మెచ్చుకున్న తక్కువే. ఇంతకీ మీరు సత్యం సుందరం చూసారా.. చూడకపోతే తప్పక చూడండి. చూసిన తర్వాత మీరు కూడా సుదర్శన్ ఇంటికి, ఆ ఇంటి పైకి వచ్చే రామ చిలుకలకు ఫ్యాన్ అయిపోతారు.