ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్

మళ్లీ డబుల్ రోల్ చేస్తోన్న యంగ్ టైగర్

బాలీవుడ్ మూవీలో అదే స్పెషల్

దేవర హంగామా ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం, వార్ -2. కాకపోతే ఇది హిందీ చిత్రం. ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదలకు ముస్తాబవుతోంది. తారక్ నటిస్తోన్న మొట్టమొదటి హిందీ చిత్రం ఇది. పైగా యశ్ రాజ్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో బాలీవుడ్ లో వచ్చిన టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3, వార్, పఠాన్ సినిమాలకు, కొనసాగింపుగా కథగా వార్ సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో, విలన్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు స్టోరీలో ట్విస్ట్ బయటికి రివీల్ అయింది. అదేంటి అంటే, ఇందులో ఇద్దరు ఎన్టీఆర్ లు కనిపిస్తారు. అంటే జూనియర్ డబుల్ రోల్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ దేవరలో డబుల్ రోల్ చేసి ఇంప్రెస్ చేసాడు ఎన్టీఆర్. ఇప్పుడు వార్ -2లో అదే క్యారెక్టర్స్ రిపీట్ చేస్తున్నాడు. కాకపోతే దేవరలో రెండు పాత్రలు పాజిటివ్ గా ఉంటాయి. కాని వార్ సీక్వెల్లో మాత్రం ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్ రోల్ అట.గుడ్ ఎన్టీఆర్ వెళ్లి బ్యాడ్ ఎన్టీఆర్ తో ఫైట్ చేస్తాడట. మరి హృతిక్ రోషన్ ఏం చేస్తాడు అంటే అదే స్టోరీ ట్విస్ట్ అంటోంది బాలీవుడ్ మీడియా. బ్రహ్మాస్త్ర తీసిన అయన్ ముఖర్జి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రమోషన్ ను ప్రారంభించబోతోంది యశ్ రాజ్ సంస్థ.

error: Content is protected !!