ప్రైడ్ తెలుగు న్యూస్ – కొత్త ఏడాది ప్రారంభంలోనే, భారత దేశం కీలకమైన ఎన్నికలను చూడబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ – జనవరి 10
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ – జనవరి 17
నామినేషన్ల పరిశీలన తేదీ – జనవరి 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – జనవరి 20 తేదీ
పోలింగ్ తేదీ – ఫిబ్రవరి 5
ఓట్ల లెక్కింపు – ఫిబ్రవరి 8
ఢిల్లీలో మొత్తం కోటిన్నర మంది ఓట్లర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు.
13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ తెలిపింది.
85 ఏళ్లు పై బడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు.
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ రాజీవ్ కుమార్ ఖండించారు. ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ఈవీఎంల రిగ్గింగ్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన అన్నారు. అసలు ఈవిఎంల రిగ్గింగ్ ఇంపాజిబుల్ అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా తనకు ఇదే చివరి ప్రెస్ మీట్ అని సీఈసీ చెప్పారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరుగుతున్నాయని, ఢిల్లీలో అన్ని ప్రాంతాల ఓటర్లు ఉంటారని పేర్కొన్నారు రాజీవ్ కుమార్.
పదవీ విరమణ తర్వాత తాను హిమాలయాలకు వెళ్లి అక్కడ కొన్ని నెలలు పాటు ఉండాలనుకుంటున్నారట. డీటాక్సి ఫైకి ఇది దగ్గరి దారి అన్నారు. ఫిబ్రవరి 18 రాజీవ్ కుమార్ రిటైర్మెంట్ కానున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా 2020 సెప్టెంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మే 15, 2022 నుంచి సీఈసీగా కొనసాగుతూ వస్తున్నారు.
ఇవి కూడా చవవండి.. బాగుంటాయి…ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి