ఎప్పుడో గత ఏడాది , డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప -2. విడుదలై నెల రోజు దాటిపోయింది. 33 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే సినిమా కలెక్షన్స్ 1800 కోట్లు దాటాయి. దాంతో బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. పుష్ప -2 తర్వాత పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో కొత్త చిత్రాలు విడుదల అవుతున్నాయి. వాటి కలెక్షన్స్ వాటివే, పుష్ప -2 వసూళ్లు పుష్పవే. అందుకే అల్లు అర్జున్ చిత్రానికి వసూళ్లు తగ్గడం లేదు. వీకెండ్ నుంచి సంక్రాంతి సీజన్ ప్రారంభం అవుతోంది. పొంగల్ పోరు కోసం టాలీవుడ్ , కోలీవుడ్ నుంచి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ దశలో పుష్ప -2కు స్క్రీన్స్ తగ్గి, వసూళ్లు మరింత తగ్గుతాయి అనుకుంటుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్ తో తిరిగొచ్చింది.

సినిమాకు సంబంధించిన దాదాపు 20 నిముషాలు కొత్త ఫూటేజీని, జనవరి 11 నుంచి అందుబాటులో ఉన్న థియేటర్స్ లో, అదే విధంగా ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న స్క్రీన్స్ లో కొత్త వర్షన్ అందుబాటులోకి రానుంది. అదే నిజమైతే పుష్ప-2 కలెక్షన్స్ పండగ సమయంలో మరింత పెరడం ఖాయం. గతంలో చాలా సార్లు, థియేటర్స్ లో నిలిచిన చాలా బ్లాక్ బస్టర్స్ కు అప్పటికే డిలీట్ చేసిన సాంగ్స్ యాడ్ చేయడం చూస్తూ వచ్చాం. కాని 20 నిముషాల ఫూటేజీ మాత్రం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అయితే 20 నిముషాల ఫూటేజీలో ఏం చూపించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో నిడివి కారణంగా కట్ చేసిన 20 నిముషాల ఫుటేజీని తిరిగి కలుపుతున్నాడు సుకుమార్. దీనికి రీలోడెడ్ వర్షన్ అని పెట్టారు. రీలోడెడ్ వర్షన్ కనుక క్లిక్ అయితే మాత్రం, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాల వసూళ్లకు గండి పడే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈ చిత్రం దంగల్ వసూళ్లను కొల్లగొట్టాలంటే మరో 150 కోట్లు అవసరం ఉన్నాయి. అందుకే చిత్ర యూనిట్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

error: Content is protected !!