రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని చూసుకుంటారు. ప్రియాంకలో నాన్నమ్మ తెగింపు ఉందని వారు నమ్ముతారు. రాహుల్ కంటే రెండున్నర ఏళ్లు చిన్న ప్రియాంక. దెహ్రాడూన్ లోని గర్ల్స్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీలోని డే స్కూల్ లో స్టడీస్ కొనసాగించారు. ఇందిరా గాంధీ హత్య  అనంతరం కొంతకాలం హోమ్ స్కూలింగ్ చేసారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసారు. కొంత కాలం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ గా పని చేసారు. ఆ సమయంలో కేవలం 1200 జీతంతో పని చేసారు ప్రియాంక గాంధీ. 2010లో బౌద్ద అధ్యయనాల్లో ఎంఏ పూర్తి చేసారు. ప్రియాంక మంచి వక్త. హిందీలో అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట.

అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రసిద్ద కవి. వారి దగ్గరే ప్రియాంక హిందీ నేర్చుకున్నారు. అందుకు కారణం అమితాబ్ తల్లి తేజీ బచ్చన్, ఇందిరా మంచి స్నేహితులు. అందుకే మొదటి నుంచి కవితలు చదవడం ప్రియాంకకు అలవాటుగా మారింది. ఈ అనుభవం ప్రసంగాల్లో పదును పెంచింది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేసింది. రెండు దశాబ్ధాలు పార్టీ కోసం పని చేసాను, 30 ఏళ్లుగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాను. ఇప్పుడు మీ సమస్యలపై నేను పోరాటం చేస్తాను, నన్ను గెలిపించడం అంటూ వయనాడ్ ఓటర్ల మనసు గెల్చుకున్నారు ప్రియాంక గాంధీ. ప్రియాంకకు వంట చేయడం అంటే సరదా, అలాగే ఫోటో గ్రఫీ అంటే ప్రాణం. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటో గ్రఫీ అంటే మక్కువ. పైగా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్. చిన్నప్పుడు నానమ్మ దగ్గర పెరగడం వల్ల, ఆమె అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం ఏర్పడ్డాయి. ఇందిర దారిలోనే చేనేత చీరల్నీ ఇష్టపడతారు. అందరితో ప్రేమగా మాట్లాడటం, అవసరం అయినప్పుడు మాత్రమే కాస్త టఫ్ గా ఉండటం, ఇందిర నుంచి వచ్చిందే అంటారు ప్రియాంకను దగ్గరి నుంచి చూసిన వారు. చిన్న నాటి స్నేహితుడు రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. అబ్బాయి పేరు రైహాన్, అమ్మాయి పేరు మీరా .

error: Content is protected !!