బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని బంగ్లాకు అగ్రరాజ్యం అమెరికా సూచించింది. ఇక్కడి మైనారిటీల భద్రతపై బ్రిటన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అందుకే తమన ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసినట్లు తమ దేశ ప్రజలకు చెప్పింది బ్రిటన్.

బంగ్లాదేశ్ లోని రద్దీ ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, ర్యాలీలు, పర్యాటక ప్రదేశాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ చెబుతోంది. బంగ్లాలోని కొన్ని మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి దాడులకు కుట్ర పన్నుతున్నారని, వీటిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని తెలిపింది బ్రిటిన్. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారని తెలిపింది.

error: Content is protected !!