ఇప్పుడంటే బాహుబలి, పఠాన్, త్రిబుల్ ఆర్, సలార్, టైగర్ లాంటి చిత్రాలకు క్రేజ్ ఉంది కాని, ఒకప్పుడు ఇండియా అంతటా ఒక్క సినిమాకు చాలా క్రేజ్ ఉండేది.అదే ధూమ్ సిరిస్. ధూమ్ వన్, టూ, త్రీ సంచలన విజయం సాధించడమే అందుకు కారణం. పాన్ ఇండియా మార్కెట్ ఇంకా క్రియేట్ కానప్పుడు ఇండియా అంతటా ధూమ్ సిరీస్ కు క్రేజ్ ఉండేది. ఏకంగా స్టార్ హీరోలే దొంగలుగా మారి , కళ్లు చెదిరే బైక్ స్టంట్స్ చేస్తూ, యాక్షన్ సీన్స్ ఇరగదీస్తూ నటిస్తుండటంతో ధూమ్ సిరీస్ కు చాలా క్రేజ్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, రెండవ భాగంలో హృతిక్, మూడో భాగంలో ఆమిర్ ఖాన్స్ ధూమ్ విలన్స్ గా నటించారు. అయితే కొన్నేళ్లుగా ధూమ్ 4వ భాగం పై చాలా రూమర్స్ వస్తున్నప్పటికీ , యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఒక దశలో 2015లో ధూమ్ 4పై ఎనౌన్స్ మెంట్ వస్తోందని ప్రచారం సాగినా, ఆ తర్వాత ఎందుకో,
ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఇప్పుడు గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ధూమ్ 4 అంటూ హంగామా మొదలైంది. షారుఖ్ ఖాన్ లేదా రణభీర్ కపూర్స్ ఒకరు.. ధూమ్ 4లోకి అడుగు పెడతారు అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ధృవీకరించారు. ధూమ్ 4కు సంబంధించిన కథ, దర్శకుడు, హీరో, విలన్ ఏది కూడా ఖరారు కాలేదని స్పష్టం చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్.ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ ఫోకస్ అంతా వారి వరుసగా నిర్మిస్తోన్న స్పై యూనివర్స్ పైనే ఉంది. టైగర్ తో మొదలైంది ఈ సిరీస్ పఠాన్, వార్ సీక్వెల్, టైగర్ వర్సెస్ పఠాన్, ఆల్ఫా, పఠాన్ 2 లాంటి స్టోరీస్ తో ముందుకు వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!