మాస్ మహారాజా అనే పేరుతో, ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది మన తెలుగు హీరో రవితేజ మాత్రమే.. మాస్ రాజా అంటే, అల్టిమేట్ మాస్ హీరో అని అర్ధం. అంతే కాకుండా బీసీ సెంటర్స్ కు, తాను రారాజు అనే అర్ధం కూడా వస్తుంది. అందుకే రవితేజ హిట్ కొట్టిన ప్రతీసారి, బీసీ సెంటర్స్ ఊగిపోతాయి. మాస్ ఆడియెన్స్ ఆటోల్లో, ట్రాక్టర్లలో, క్యూ కట్టి మరీ వస్తారు. ఈ మధ్య కాలంలో క్రాక్, ధమాకా సినిమాలు అలాంటి సీన్స్ ను చూపించాయి. కరోనా కాలంలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది క్రాక్. ఇక ధమాకా సంగతి తెలిసిందే. ఒక్కసారి మాస్ రాజా మూవీ మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే,
ఎంత ఈజీగా వంద కోట్లు వచ్చేస్తాయి అనేది ఈ మూవీ ప్రూవ్ చేసింది. అయితే రవితేజ చేస్తోన్న సినిమా.. క్యూ కడుతున్న ఫ్లాపులు.. అతని మార్కెట్ ను డేంజర్ లో పడేస్తున్నాయి. ముందు రావణాసర, ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాల పరాజయాల తర్వాత ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైన మిస్టర్ బచ్చన్ కూడా గతంలో విడుదలైన చిత్రాలన్నిటికంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడిలో 25 శాతం కూడా తిరిగిరాబట్టలేకపోయాడు మిస్టర్ బచ్చన్. కథలో లోపాలు, పాత్రలో వెయిట్ లేకపోవడం వల్లే మాస్ రాజా చిత్రాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి అనేది అతని అభిమానులే చెప్పుకొస్తున్నారు. కాని రవితేజ మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు, పైగా యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాస్ రాజా రొమాంటిక్ రాజాగా మారడం ఒక సెక్షన్ ఆడియెన్స్ కు నచ్చడం లేదు. ఈ దశలో రవితేజ నటించే కొత్త చిత్రంపైనే అందరి చూపు ఉంది. అందుకు కారణం ధమాకా కాంబినేషన్ రిపీట్ కావడమే..
కొత్త చిత్రంలో శ్రీలీలతో మరోసారి జోడి కడుతున్నాడు మాస్ రాజా. అయితే ఓ కొత్త దర్శకుడు వీరి కాంబినేషన్ ను సెట్ చేసాడు. అతను ఎవరో కాదు, వాల్తేరు వీరయ్య చిత్రానికి మాటల రచయిత భాను భోగవరపు. తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ గా ఎదిగిన సితారా ఎంటర్ టైన్ మెంట్స్ మాస్ రాజా న్యూ మూవీని నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆ నిర్ణయం మారిందని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇన్ ఫర్ మేషన్. ఏది ఏమైనా ధమాకా కాంబినేషన్ రిపీట్ తో అయినా మాస్ రాజా తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.