ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టమర్ల కోసం కొత్త చెక్ – ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇక పై ఓయో రూమ్ బుక్ చేయాలంటే, పెళ్లి అయ్యి ఉండాలి. గతంలో ఓయో రూమ్ బుక్ చేయాలంటే, కేవలం మేజర్లు అయితే సరిపోయేది.

రూమ్ బుక్ చేసుకునే జంట మేజర్లు అయితే సరిపోయేది. పెళ్లి ప్రస్తావన ఉండేవి కాదు. కాని ఇప్పుడు ఈ నిబంధనను మార్చింది ఓయో కంపెనీ. పెళ్లి అయిందని ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ లేదా ఐడీ ఉంటేనే, రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ రూల్స్ ను ముందుగా మీరట్  నుంచి ప్రారంభించింది ఓయో. తమ పార్ట్ నర్ హోటల్స్ లో ఈ నిబంధన తక్షణమే అమలులోకి వచ్చిందని చెప్పింది. మీరట్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి, మిగితా నగరాలకు ఈ రూల్ ను విస్తరించాలనుకుంటోంది ఓయో.

ఓయో బ్రాండింగ్ ను మరింత సేఫ్టీగా మార్చేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహద పడుతుందని ఓయో చెప్పుకొస్తోంది.  ఒక సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో కట్టుబడి ఉందని కంపెనీ నిర్వహకులు చెప్పుకొస్తున్నారు.  కుటుంబాలు, విద్యార్ధులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతి అందించే క్రమంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది కంపెని. ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు ఓయో చక్కటి అవకాశంగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మారిన రూల్స్ ప్రకారం ఇకపై పెళ్లి కాని జంటలు రూమ్ బుక్ చేసుకునే అవకాశం లేదు.

error: Content is protected !!