
రోహిత్ శర్మ పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో వైపు టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను బీసీసీఐ ఎంపిక చేయబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు, పాండ్యను కెప్టెన్ గా ఎనౌైన్స్ చేయబోతున్నారట. అదే జరిగితే వచ్చే నెలలో జరగబోయే ఛాపియన్స్ ట్రోఫీకి కూడా పాండ్య నాయకత్వం వహించాల్సి ఉంటుంది. పాండ్యా కెప్టెన్ అయితే, రోహిత్ జట్టులో కొనసాగుతాడా లేక టెస్టులతో పాట, వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ లేకుండానే ఆస్ట్రేలియాతో అత్యంత కీలకమైన ఐదో టెస్ట్ ను భారత్ ఆడుతోంది.