వయనాడ్ లో చోటు చేసుకున్న ఘోర విపత్తుపై స్పందిస్తూ , బాధితులకు సహాయార్ధం చిరంజీవి, రామ్ చరణ్ కలసి, కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి నేరుగా కేరళ వెళ్లారు. అక్కడ సీఎం పినరయి విజయన్ ను కలిశారు. వయానాడ్ విపత్తు పై తన వంతుగా బాధ్యతగా, కోటి రూపాయల చెక్కును సీఎంకు అందించారు చిరు. ఆ తర్వాత వయనాడ్ లో ప్రస్తుత పరిస్థితులను సీఎంతో చర్చించారు మెగాస్టార్.