కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తును చూసి సినీ తారలు చెలించిపోతున్నారు. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.మల్లు అర్జున్ గా ఫేమ్ అందుకున్న తెలుగు నటుడు అల్లు అర్జున్, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు, 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటివరకు తెలుగు హీరోలు ఎవరూ కూడా ఆ స్థాయిలో విరాళాన్ని ప్రకటించలేదు.