ఓ కొత్త సినిమా ప్రమోషన్స్ లో విశాల్, కనిపించిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా వేదికపై విశాల్ మైక్ లో మాట్లాడుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి, అంతే కాకుండా కంటి నుంచి తరచూ నీరు కారుతోంది. మాట కూడా సరిగ్గా రావడం లేదు. ఒకప్పుడు తిరుగులేని యాక్షన్ హీరోగా వెలిగిన విశాల్, ప్రస్తుతం అనారోగ్యంతో కనిపించడం వెనుక కారణం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఇదే విషయంపై విశాల్ సన్నిహితులను అడిగి తెల్సుకుందాం అనుకుంటే, వారందరూ అస్సలు మీడియాకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఇంతలో చెన్నైకి చెందిన అపోలో హాస్పటల్ వైద్యులు,  హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ముందు నుంచి ప్రచారంలో ఉన్న వార్తనే మళ్లీ చెప్పుకొచ్చారు. ఎంత వైరల్ ఫీవర్ ఉన్నా, విశాల్ అంత కృంగిపోయి కనిపించడం పై అనుమానాలు కలుగుతున్నాయి. 12 ఏళ్ల క్రితం విశాల్ నటించిన మజ గజ రాజా అనే తమిళ చిత్రం వచ్చే సంక్రాంతి పండక్కి విడుదల అవుతోంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో విశాల్ కనిపించిన వీడియోలు, ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విశాల్ త్వరగా కోలుకోని తిరిగి రావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

error: Content is protected !!