చైనాలో విజృంభిస్తోన్న హెచ్ ఎం పీవీ వైరస్ పై … ఆ దేశం ఎట్టకేలకు స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సమయంలో, ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వైరస్ పై వివరణ ఇచ్చింది. శీతలకాలం కావడంతో ఇన్ ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని, అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగానే ఉందని, విదేశీయుల ఆరోగ్యంపై తమ దేశం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పుకొచ్చింది. చైనాలో హెచ్ ఎం పీవీతో పాటు ఇన్ ఫ్లూయెంజా ఏ, మైకో ప్లాస్మా, నిమోనియా, కోవిడ్ 19 కూడా వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే శీతాకాలంలో ఈ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి చైనా సీడీసీ మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పుకొచ్చింది మావో నింగ్.

error: Content is protected !!