తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ, అద్భుతమైన ఫైట్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి కటౌట్ ఇప్పుడు నీరసించి, శక్తిని కోల్పోయి, పూర్తిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. 

గత ఏడాది విశాల్ రిలీజ్ చేసిన రత్నం కూడా యాక్షన్ ఫిల్మ్. పైగా ఈ చిత్రంలో విశాల్ ఎప్పటిలాగే ఫిట్ గా కనిపించాడు. అభిమానులు కోరుకున్న విధంగా యాక్షన్ ఇరగదీశాడు. కొంత గ్యాప్ ఇప్పుడు కొత్త సినిమా మద గజ రాజా చిత్రం ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చాడు. మద గజ రాజా అనేది 12 ఏళ్ల క్రితం నాటి చిత్రం, ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే విశాల్ వీక్ గా కనిపించాడు. ప్రెస్ మీట్ లో అసౌకర్యంగా కనిపించాడు. మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా చేతులు వణుకుతూ కనిపించాయి.

ఏది ఏమైనా విశాల్ పూర్తి ఫిట్ నెట్ తో, గతంలో ఏ విధంగా అయితే ఎనర్జిటిక్ గా కనిపించాడో అలాగే తిరిగి ప్రేక్షకుల ముందుకు రావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మద గద రాజా ప్రెస్ మీట్ లో విశాల్ వీక్ గా కనిపించడానికి రీజన్ అతనికి హై ఫీవర్ అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది. అందుకే ప్రెస్ మీట్ లో విశాల్ చేతులు వణికాయని, అంతుకు మించి, విశాల్ కు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెబుతోంది. సోషల్ మీడియాలో విశాల్ అభిమానులు మాత్రం అతను త్వరగా కోలుకోవాలని పోస్టలు పెడుతున్నారు.

error: Content is protected !!