సినిమాల్లో షారుఖ్ ఎంతో మంది విలన్స్ ను బెదిరించాడు. కొంత మంది విలన్స్ ను కైమాక్స్ లో హతమార్చాడు. కాని షారుఖ్ కు రియల్ గానే ఒక అగంతకుడు చంపేస్తానంటూ బెదిరించాడు. హీరోలకే హీరో అయిన షారుఖ్ ను బెదిరించిన ఆ వ్యక్తి ఎవరు…ఎందుకు బెదిరించాడు.. ఎలా దొరికిపోయాడు.. తెల్సుకుందాం రండి.బాలీవుడ్ బడా హీరోలకు బెదిరింపులు ఎక్కువ అయిపోయాయి. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వస్తున్నాయి.షారుఖ్ ఖాన్ ను కూడా ఇటీవల ఒక వ్యక్తి బెదిరించిన వార్తలు వచ్చాయి. అయితే బాద్ షాను బెదిరించిన వ్యక్తిని ఎట్టకేలకు ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.

ఇక అసలు స్టోరీలోకి వెళితే,  నిందితుడి పేరు ఫైజల్ ఖాన్. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాం,  రాయ్ పూర్ కు చెందిన వాడు ఫైజల్ ఖాన్. కొద్ది రోజుల క్రితం షారుఖ్ ఖేల్ ఖతం అంటూ ముంబై పోలీసులకు డైరెక్ట్ గా కాల్ చేసాడు ఫైజల్.  50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ ను హతమార్చుతాను అంటూ బెదిరించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసారు.

అసలు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ కు చెందిన ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద నంబర్ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఛత్తీస్ గఢ్ వెళ్లి ఫైజల్ ఖాన్ ను అరెస్ట్ చేసారు ముంబై పోలీసులు. దాంతో షారుఖ్, అలాగే అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫైజన్ ఎందుకు షారుఖ్ ను టార్గెట్ చేసాడు అనేది తెలియాల్సి ఉంది.

error: Content is protected !!