గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కనిపించింది సిరియా. ఈ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసగ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పోలోకి తిరుగుబాటు దారులు ప్రవేశించారు. 2016 తర్వాత మరోసారి ఈ నగరం పై తిరుగుబాటుదారులు పట్టుసాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హయాత్ తహరీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలో తిరుగుబాటు దారులు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అలెప్పో నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత అదే ఉత్సాహంతో సిరియాలో నాలుగో అతి పెద్ద నగరమైన హమా పై పట్టుసాధించే పనిలో పడ్డారు. మరో వైపు సిరియా అండగా రష్యా రంగంలోకి దిగింది. తిరుగుబాటుదారులు ఆక్రమించిన నగరాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది.మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.