
భారత్ లో ఒక వైపు వారానికి 70 గంటలు పని చేయాలంటూ, పలువురు ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. ఈ టాపిక్ ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే, బ్రిటిన్ లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాలు విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్త, ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. బ్రిటన్ లో ఈ పని విధానాన్ని తీసుకొచ్చేందుకు 5 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న సుమారు 200 కంపెనీలు ఒక ఒప్పందం పై సంతకాలు చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ది ఫోర్ డే వీక్ ఫౌండేషన్ చేపట్టిన ప్రచారానికి మార్కెటింగ్, టెక్నాలజీ కంపెనీలు, వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు మద్దతు తెలిపాయట. వారంలో నాలుగు రోజులే వర్క్ వల్ల ఉత్పాదకత మెరగవుతుందని ఫౌండేషన్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది. ఈ పాయింట్ అందర్ని ఆకర్షించింది. చవిరికి బ్రిటన్ లో కొంత మంది ఉద్యోగులకు మేలు జరిగింది. తొలుత ఈ విధానాన్ని బ్రిటన్ లో దాదాపు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ , ప్రెస్ రిలేషన్స్ సంస్థలు అమలు చేసాయి. ఈ తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాప్ట్ వేర్ సంస్థలు, 22 మేనేజ్ మెంట్, కన్సల్టింగ్ కంపెనీలు, ఇదే బాటలో నడిచినట్లు సర్వేలో వెల్లడైంది. అత్యఅధికంగా లండన్ లో 59 కంపెలు ఈ నూతన పని విధానాన్ని అనుసరిస్తున్నాయట. భారత్ లో ఇలాంటి పని గంటలు అమలు అనేది ఒక కల మాత్రమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.