మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్, ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి కూడా, ఈ సినిమాలో కమల్ ఘాటు రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. 70 ఏళ్ల కమల్ ఏంటి, 40 ఏళ్లు ఉన్న ఇద్దరు హీరోయిన్స్ తో ఆ హాట్ హాట్ రొమాన్స్ ఏంటి అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. రొమాంటిక్ సీన్స్ కు కమల్ కేరాఫ్ అడ్రస్. కెరీర్ బిగినింగ్ నుంచి ఆయన ఇలాంటి సన్నివేశాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.

కాని తగ్ లైఫ్ వేరు.. ఆయన వయసు 70 ఏళ్లు ..ఈ వయసులో ఇంత ఘాటు రొమాన్స్ అంటే.. అంటే ఏంటి.. ఏమవుతుంది.. ఆయన ప్రేమకు వయసుసుతో సంబంధం లేదు. సినిమా చూడండి. ఆ సినిమాలో పాత్రలను మాత్రమే చూడండి.. అంతే కాని, కమల్, త్రిష, అభిరామిలను ఎందుకు చూస్తున్నారు. పురుషులు, స్త్రీలు, తమకంటే చిన్నవారితో, పెద్దవారితో రిలేషన్ లో ఉంటారు. ఇదీ జీవిత సత్యం అందులో ఎలాంటి అబద్దం లేదు. తప్పును వేలెత్తి చూపండి. అభిప్రాయాలు చెప్పండి. సమాజంలో జరిగే  చాలా విషయాలను మనం పెద్దగా పట్టించుకోం, ఇధి కూడా అలాగే అనుకోండి. అని సింపుల్ గా అనేసారు మణిరత్నం.

జూన్ 5న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత కమల్ రొమాంటిక్ సీన్స్ ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. అన్నట్లు ఈ చిత్రంలో శింబు అనే సెన్సేషనల్ స్టార్ కూడా ఉన్నాడు. ఆయన కూడా కింగ్ ఆఫ్ రొమాన్స్.  కాని తగ్ లైఫ్ కమల్ చిత్రం. అందుకే శింబు సైలెంట్ గా ఉన్నాడేమో.. ఏది ఏమైనా తగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజే.. మిగితా విషయాలపై క్లారిటీ వస్తుంది.  

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!