డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేద్దాం.. ఆగస్ట్ 14న రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ రిలీజ్ అవుతోంది. ఈ  చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. రజనీకాంత్ తో పాటు హిందీ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్  పైగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, దీంతో కూలీ క్రేజ్ మామూలుగా లేదు. పైగా అనిరుథ్ సంగీతం ఈ సినిమా క్రేజ్ నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

అందుకే ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే హిందీ వర్షన్ రైట్స్ కొనుకున్న వారు, సినిమాకు మజ్దూర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చింది. సాక్షాత్తు అమితాబ్ నటించిన కూలీ చిత్రం ఉండగా, మళ్లీ రజనీకాంత్ సినిమాకు, ఆ క్లాసిక్ టైటిల్ ఎందుకు మార్చినట్లు, కూలీ నే బాగుంది కదా అని వేలల్లో ట్వీట్స్ పడ్డాయి.

దీంతో మేకర్స్ దిగి వచ్చారు. రజనీకాంత్ చిత్రాన్ని హిందీలో కూలీ పేరుతోనే విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ అంటూ, అందుకు మరో 50 రోజులు మాత్రమే ఉందటూ, స్పెషల్ గా ప్రమోషన్ ఫోటోస్ రిలీజ్ చేసారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ లుక్ మారోసారి అదిరిపోయింది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!