విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. సినిమాను నెత్తిన ఎత్తుకుంటారు. ఇప్పుడు అలాంటి చిత్రమే వారి ముందుకు వచ్చింది. అదే చంద్రేశ్వర చిత్రం. సరిగ్గా కన్నప్ప రిలీజైన రోజునే మరో శివుడి నేపథ్యంలో చిత్రం విడుదల కావడం విశేషం. అయితే ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో , ఎగ్జైటింగ్ మేకింగ్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా.. అసలు చంద్రేశ్వర నేపథ్యం ఏంటి.. రివ్యూలో తెల్సుకుందాం రండి.

చంద్రేశ్వర కథ –

థ్రిల్లర్ , సస్పెన్స్, డివోషన్, ఇలా అన్ని కలపిని కథ చంద్రశ్వర సినిమా. స్టోరీలో మెయిన్ పాయింట్ తీసుకుని చూస్తే, ఇది కార్తికేయ సిరీస్ ను గుర్తు చేస్తుంది. కాకపోతే అందులో కంటే ఎక్కువ ట్విస్టులో ఇందులో దర్శకుడు పొందు పరిచాడు. అందుకే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ నరేటివ్ కనిపిస్తుంది. నందివర్మ పరత్వం,  దాని కింద పురాతన కాలం నాటి ఒక గుడి దాగుంది అనేది రహస్యం.

అక్కడ గుడి ఉందని ఆర్కియాలజీ డిపార్టె మెంట్ రంగంలోకి దిగడం, ఇంతలో ఊరి ప్రజలు వారిని అడ్డుకోవడం, అలా ఎందుకు అంటే సెంటిమెంట్ ప్రకారం ఆ పర్వతం, లేదా గుడి జోలికి ఎవరు వెళ్లినా, అదే ఊరిలో ఎవరో ఒకరు అంతు చిక్కని విధంగా మరణిస్తుంటారు. అందుకే గ్రామ ప్రజలు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ను కూడా ఊరిలోకి రానివ్వరు. అయితే ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆ ఊరి ప్రజలను ఒప్పిస్తుంది. రహస్యం ఏంటో తేల్చేద్దాం అంటుంది. కాకపోతే రాత్రులు మాత్రం తవ్వకాలు, గుడి జోలికి వెళ్లకపోవడం లాంటివి నియమాలు పెట్టి, గ్రామ ప్రజలను ఒప్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ప్రేక్షకుల ఊహకు కూడా అందకుండా సినిమాల స్క్రీన్ ప్లే పరుగులు తీస్తుంది. ఇక హీరో లేకుండా కథ ఎలా సాగుతుంది.

చంద్రగిరికి సబ్ ఇన్స్ పెక్టర్ గా వచ్చే సురేశ్ రవి ఈ మిస్టరీని ఛేదించేందుకు తనవంతుగా రంగంలోకి దిగుతాడు.. ఇదే క్రమంలో హీరోయిన్ , ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ మెంబర్ ఆశ వెంకటేష్ తో ప్రేమలో పడతాడు.. ఆ తర్వాత వీరిద్దరు ఏం కనిపెట్టారు.. ఏం చేసారు..ఎలా ఆ ఊరిని కాపాడారు అనేది క్షణ క్షణం ఉత్కంఠను కలిగిస్తూ ముందుకు సాగుతుంది.

చంద్రేశ్వర అంచనాలను అందుకుందా..?

ఇలాంటి కథకు సినిమాటోగ్రఫీ, నరేషన్ చాలా కీలకం. ఆ విషయంలో దర్శకుడు జీవీ పెరుమాళ్ వర్ధన్ అద్భుతంగా స్టోరీని డీల్ చేసాడు. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుల మూడ్ ను సెట్ చేసాడు. అయితే ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్, సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్, ఇక హీరో హీరోయన్స్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు మెయిన్  హైలైట్స్. అవి ఏంటి అనేది మీరు సినిమా థియేటర్ కు వెళ్తేనే తెలుస్తుంది.

ఒక రాజుని ఓడించాలంటే, ముందు వారి ఆచార వ్యవహారలపై దెబ్బకొట్టాలనే డైలాగ్ ఉంది చూశారు.. అది పీక్స్ అంటున్నారు థియేటర్స్ లో ప్రేక్షకులు. ఇక సనాతన పద్దతులను చూపించిన విధానం కూడా ప్రేక్షకులను అబ్బుర పరిచింది. అదృశ్య ఖగ్డం గురించి డైలాగ్స్ అదిరిపోయాయి. చెప్పాల్సిన కథను చాలా ఆసక్తికరంగా చెప్పడంలో చిత్ర యూనిట్ విజయం సాధించిందనే చెప్పాలి.

చంద్రేశ్వర నటీ నటులు, సాంకేతిక నిపుణులు..

సబ్ ఇన్స్ పెక్టర్ గా సురేష్ రవి పెర్ఫామెన్స్ సినిమాకు బాగా సూట్ అయింది. అతని స్క్రీన్ ప్రసెన్స్ ఇంప్రెసివ్ గా ఉంది. నటన కూడా చాలా బాగుంది. సినిమాలో ఏ ట్విస్ట్ అయినా సరే, తానే తేల్చేస్తాడు. చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తాడు. అందుకే ఈ సినిమాకు ఇతని నటనే బలం. ఆర్కియాలజీ ఎక్స్ పర్ట్ గా ఆశ వెంకటేశ్ నటన ఆకట్టుకుంటుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో చక్రవర్తి నిళల్ గళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్, జెఎస్ కె గోపి నటన బాగుంది. దర్శకుడు వీరి పాత్రలను మలిచిన విధానం ఇంకా బాగుంది.

చంద్రేశ్వర  హైలైట్స్

సినిమా స్టోరీనే హైలైట్. నటీ నటుల పెర్ఫామెన్స్ కూడా మరో హైలైట్. కాకపోతే సినిమా నేపథ్య సంగీతం అన్నిటికంటే హైటైల్. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీలకం. ఆ విషయంలో జెరాడ్ ఫిలిక్స్ వందకు వంద మార్కులు వేయించుకున్నాడు. చాలా సన్నివేశాలను, తన నేపథ్య సంగీతంతో రక్తికట్టించాడు. ఎడిటింగ్ వర్క్ చేసిన నందమూరి హరి పని తనం ను ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

చంద్రేశ్వర – ఫైనల్ వర్డ్ –

థియేటర్స్ లో తప్పక చూడాల్సిన చిత్రం. ఈ తరహా స్టోరీస్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన చిత్రం చంద్రేశ్వర మూవీ. ఈ చిత్రానికి ప్రైడ్ తెలుగు ఇస్తోన్న రేటింగ్ 3/5 .

ఇది కూడా చదవండి

error: Content is protected !!