
రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ క్రేజ్ గురించి తెల్సిందే. ఇప్పటికే రిలీజైన చిన్న చిన్న టీజర్స్, ఇటీవల అనిరుథ్ కనిపించిన ఫస్ట్ సింగిల్, ఈ సినిమా క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇక సినిమాలో విలన్ గా నాగార్జున, ముఖ్య పాత్రలో ఆమిర్ ఖాన్, మరో పాత్రలో ఉపేంద్ర, ఈ మల్టీస్టారర్ కు కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చారు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు కనీ వినీ ఎరుగని పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే తమిళ వర్షన్ ఓవర్సీస్ రైట్స్, కోలీవుడ్ హిస్టరీలోనే అంటే 80 నుంచి 90 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇప్పుడు తెలుగు వర్షన్ రైట్స్ ను దాదాపు 44 కోట్లకు, ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ రంగంలోకి దిగారు. వారు ఎవరో కాదు దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ నారంగ్, ఇంకా సురేష్ బాబు, వీరు ముగ్గరు కలసి కూలీ తెలుగు వర్షన్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే మాత్రం కూలీ తెలుగు వర్షన్ ఒక్కటే దాదాపు వంద కోట్లు గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.. తెలుగులో 2.0 ఆ తర్వాత కేజీయఫ్ 2 తర్వాత మళ్లీ అస్థాయిలో బిజినెస్ చేసిన చిత్రం ఇదొక్కటే
ఇది కూడా చదవండి