సెప్టెంబర్ 25, ఈ డేట్ కు చాలా క్రేజ్ ఉంది.
ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటిస్తోన్న కొత్త చిత్రం ఓజీ రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జులై 24న హరి హర వీరమల్లు చిత్రం విడుదల అవుతోంది. మరికొద్ది గంటల్లో భారీ ఎత్తున ట్రైలర్ రిలీజ్ కానుంది.

అయితే జులైలో వీరమల్లు, సెప్టెంబర్ లో ఓజీ అంటే, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అవుతాయని, రెండు పెద్ద చిత్రా మధ్య గ్యాప్ ఉండాలని, అందుకే చిరు నటిస్తోన్న కొత్త చిత్రం విశ్వంభర, అప్పటికీ గ్రాఫిక్స్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ కు రెడీ అవుతోందని, రూమర్ మొదలైంది. అయితే ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదని, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఖరారు చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఓజీ అనేది పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్, ఓ విధంగా ఇప్పుడు తెరకెక్కుతున్న ఏ ప్యాన్ ఇండియా సినిమాకు కూడా ఇంత క్రేజ్ లేదు. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి. గతంలో ఒకటి రెండు సభల్లో సైతం పవన్ కల్యాణ్, ఓజీ చూద్దురు గాని బాగుంటుందని చెప్పి, ఆ అంచనాలను ఇంకా ఇంకా పెంచాడు. త్రిబుల్ ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ విలన్ గా నటిస్తున్నాడు. హీరోయిన్ గా ప్రియాంక  మోహన్ కనిపించనుంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!