
ప్రతీ ఏటా పవన్ తన సన్నిహితులకు మామిడిపండ్లను పంపిస్తుంటారు.
ఒకప్పుడు పవర్ స్టార్ పంపిన మామిడి పండ్లు అంటూ స్టార్స్ ఎంతో ఆనందంగా, సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇప్పుడు పవర్ స్టార్ పీపుల్స్ స్టార్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలలం కురిడి గ్రామస్థులకు పవన్ మామిడి పండ్లను పంపించారు. ఆయన అనుచరులు ఇక్కడ ఇంటింటికి వెళ్లి గ్రామస్థులందరికీ మామిడి పండ్లను అందజేశారు. పవన్ కు గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కొన్ని నెలల క్రితం, అడవి తల్లి బట కార్యక్రమంలో భాగంగా కురిడి గ్రామాన్ని సందర్శించి, గిరిజనులతో మమేకమయిన సంగతి తెల్సిందే.తన తోటలో ఆర్గానిక్ పద్దతిలో పండించిన పండ్లను గ్రామంలో పంపిణి చేయాలని ఆదేశించారు. 230 ఇళ్లకు అరడజను చొప్పున మామిడి పండ్లను పవన్ సిబ్బంది పంపిణి చేసారు
ఇది కూడా చదవండి
