కింగ్డమ్ తో ఎట్టిపరిస్థితుల్లో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. అందుకోసం ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రమోషన్స్ నిర్వహించడం మాత్రమే కాదు. మిగితా స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేసాడు. తన సినిమా ట్రైలర్ రిలీజైతే, సూపర్ స్టార్, ఐకాన్ స్టార్ , టైగర్ ఫ్యాన్స్ కూడా బాగుందని ప్రశంసించారని చెప్పి మురిసిపోయాడు రౌడీ. అంతటితో ఆగకుండా ఏకంగా పవర్ స్టార్ ఆశీస్సులు తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో,

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. పవన్ టూ పీస్ సూట్ లో స్టైలిష్  గా ఉన్నాడ. అక్కడికి కింగ్డమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే వెళ్లారు. నిముషాల్లో ఫోటో వైరల్ అయింది.  టాలీవుడ్ లో ఇప్పటికీ తిరుగులేని స్టార్ గా వెలుగుతున్నాడు పవర్ స్టార్. పూర్తిగా క్రేజ్ లేని వీరమల్లు చిత్రానికి కూడా తనదైన ప్రమోషన్స్ తో  బంపర్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాడు. పవన్ పిలుపు ఇస్తే ఎలాంటి సంచలనం నమోదవుతుంది అని చెప్పడానికి ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, రీసెంట్ గా హరి హర వీరమల్లు ఓపెనింగ్స్ సింపుల్ ఎగ్జాంపుల్.

ఇది కూడా చదవండి

error: Content is protected !!