
సరిగ్గా చూస్తే బాక్సాఫీస్ దగ్గర కనిపించే వింతలు విశేషాలు అన్ని ఇన్ని కావు. ఆగస్ట్ 5న సౌత్ మొత్తం భారీ ఎత్తున రిలీజైంది మదరాసి అనే చిత్రం. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు పెద్దగా ఆశలు లేవు. ఏళ్లుగా ఈ స్టార్ డైరెక్టర్ కు హిట్స్ లేవు. దీంతో తెలుగు ఆడియెన్స్ కు అయితే, మురుగదాస్ న్యూ మూవీ మదరాసిపై హోప్స్ లేవు. పైగా అనిరుథ్ మ్యూజిక్ కూడా ఎక్కడా సౌండ్ లేదు. దీంతో మదరాసికి శివకార్తికేయన్ ఒక్కడే క్రౌడ్ పుల్లర్ గా మారాడు.
అంతకు ముందు తాను నటించిన అమరన్, అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో, సహజంగానే మదరాసికి మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చిపెట్టింది. అయితే మురుగదాస్ మరోసారి సెకండ్ హాఫ్ లో తడబడటంతో, మదరాసి వసూళ్ల పై ప్రభావం పడుతోంది. ముఖ్యాంగా కోలీవుడ్ మదరాసి పర్లేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, తెలుగు నాట మాత్రం పూర్తిగా టాక్ భిన్నంగా ఉంది. ఒక్కటే సినిమాకు కోలీవుడ్ లో ఒక టాక్, టాలీవుడ్ లో మరో టాక్, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. పైగా కోలీవుడ్ మూవీస్ ను తమిళ ప్రేక్షకులు రిజెక్ట్ చేసినా, మన ప్రేక్షకులు నెత్తికెత్తుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
బహుశా మురుగదాస్ ఈ మధ్య తెరకెక్కించిన సినిమాలు మదరాసిపై పడ్డాయి అనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ఏది ఏమైనా మదరాసి తొలి రోజు వసూళ్లు 20 కోట్లు పైనే ఉండవచ్చు అనేది సినిమా పండితులు చెబుతున్నారు. అదే నిజమైతే శివకార్తికేయన్ స్టార్ డమ్ అడుగులు పడుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఏమాత్రం బజ్ లేని సినిమాకు, ఒక డిజాస్టర్ డైరెక్టర్ తో ఈ స్థాయి ఓపెనింగ్స్ అంటే చిన్న విషయం కాదు.
ఇవి కూడా చదవండి
