మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వండర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో అర్ధం కాకుండా ఉంది. ఇంతకు ముందు కంటెంట్ కావాలంటే మాలీవుడ్ వరకు వెళ్లాలి అనే వారు. కాని ఇప్పుడు కంటెంట్ తో పాటు కోట్లకు కోట్లు కలెక్షన్స్ కురిపిస్తోంది మాలీవుడ్.

ఆగస్ట్ 28న థియేటర్స్ లోకి వచ్చిన లోకా, మాలీవుడ్ బాక్సాఫీస్ ను,  ఓవర్సీస్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. అందుకే 12 రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్స్ ను దాటింది. మరోవారం రోజులు సినిమా గట్టిగా నిలబడితే చాలు, ఈజీగా మాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంపురాన్ -2 కలెక్షన్స్ ను క్రాస్ చేయవచ్చు. అదే జరిగితే మోహన్ లాల్ డామినేషన్ కు గండిపడినట్లే..

మాలీవుడ్  ఫస్ట్ 200 కోట్ల మూవీని మంజుమ్మెల్ బాయ్స్ అందించారు. ఆ తర్వాత ఆ రికార్డ్ ను మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ -2 బద్దలు కొట్టింది. మళ్లీ లాల్ నటించిన మరో మూవీ తుడరుమ్ కూడా 200 కోట్ల వసూళ్లను దాటింది. ఇప్పుడు మాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ అంటే ఈజీగా 200 కోట్లు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ కు కూడా ఇలాంటి వసూళ్లు రావడం లేదు.

ఈ 200 కోట్ల లెక్కను విశ్లేషిస్తే, వందకోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చాయి. ఇక 65 కోట్లు కేరళ నుంచి వచ్చాయి. మిగితా 35 కోట్లు టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ కలసి అందించాయి. ప్రస్తుతం ఈ సినిమా 300 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!