పెద్ది పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మార్చిలో పెద్ది రిలీజ్ ఉంది. ఆ తర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. అదే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిత్రం. ఇప్పటికే సుకుమార్ స్టోరీని లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ను కూడా ఖరారు చేసారట.

ఆమె ఎవరో కాదు, మదరాసి హీరోయిన్ రుక్మిణీ వసంత్. కెరీర్ లో పెద్ద పెద్ద విజయాలు లేకపోయినా, పెద్ద పెద్ద సినిమాలు పట్టేస్తోంది ఈ కన్నడ సుందరి. ఆల్రెడీ తమిళంలో  నటించిన రెండు చిత్రాలు ఫ్లాపే.. అయిన సరే, రుక్మిణీకి అవకాశాలు అందివస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ టాక్సిక్ లో యశ్ కు జోడిగా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న డ్రాగన్ అనే మూవీలోనూ తానే హీరోయిన్. ఇప్పుడు సుకుమార్ డైరెక్ట్ చేయబోయే చిత్రంలో చరణ్ కు జోడీగా అవకాశం అందుకుంది అనేది ప్రచారం సాగుతోంది.

సింగిల్ బిగ్ హిట్ లేకుండానే రుక్మిణీ కెరీర్ , ఇలా దూసుకుపోతుంటే, ఇక హిట్ పడితే, దెబ్బకు సౌత్ లో టాప్ స్టార్ కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!