
కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఒకటి ఖైదీ -2. ఎందుకంటే అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అన్నది స్టార్ట్ అయిందే, ఖైదీ నుంచి అనే విషయం తెల్సిందే. అయితే కూలీ తీసిన తర్వాత, లోకేష్ కనగరాజ్ పరిస్థితి ఏం బాగోలేదు. ముందు ఆమిర్ ఖాన్ తో ప్లాన్ చేసిన సూపర్ హీరో మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ మల్టీస్టారర్ మూవీ నుంచి కూడా లోకేష్ ను తప్పించారు. దీంతో ఖైదీ -2 పై రూమర్స్ మొదలయ్యాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో కార్తి, లోకేష్ కనగరాజ్ ఖైదీ -2ను ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసారని, కోలీవుడ్ నుంచే ఈ రూమర్ మొదలైంది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రస్తుతం కార్తి చేతిలో ఉన్న చిత్రాలన్ని పూర్తైన తర్వాత, ఖైదీ -2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటోంది తమిళ మీడియా. లోకేష్ నుంచి ఏదో ఒక అఫీసియల్ కన్ ఫర్ మేషన్ వస్తే, ఈ రూమర్స్ కు బ్రేక్ పడుంది. ఖైదీ -2 పై కోలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఖైదీ -2లో ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన హీరోలు, విలన్లు, అందరూ మరోసారి స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. పైగా కోలీవుడ్ కు వెయ్యి కోట్ల కలను నెరవేరుస్తుందని అంచనాలు ఉన్నాయి. కాని ఇప్పుడు లోకేష్ కష్టాల్లో ఉండటం, కూలీ ఎఫెక్ట్ బాగా ఉండటంతో, ఖైదీ -2 ఉంటుందా, ఉండదా అనే డౌట్స్ మొదలయ్యాయి
ఇవి కూడా చదవండి
