రవీంద్రభారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈ నెల 15 జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాజీ రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుపనున్నట్లు ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ తెలిపింది. ఉప ముఖ్యమంత్రి భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కూడా హాజరుకానున్నారు.

సాయంత్రం 4 గంచలకు బాలుగారికి నివాళిగా సినీ సంగీత స్వర నిరాజనం కార్యక్రమం జరగనుంది. కీరవాణి, తమన్ లాంటి సంగీత దర్శకుల ఆధ్వర్యంలో నిరాజనం కార్యక్రమం జరగనుంది. ఎస్పీబీ విగ్రహాన్ని రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహం ఏర్పాటు పై తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!