చెప్పను బ్రదర్‌ నుంచి మొదలైంది, మెగా ఫ్యాన్స్ కు, అల్లు అర్జున్‌కు గ్యాప్, అది గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వెళ్లి, వైసీపీ స్నేహితుడు శిల్పరవి కోసం, ప్రచారానికి వెళ్లడంతో గ్యాప్ మరింత పెరిగింది. ఆ విషయాన్ని నాగబాబు, సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో తమ పోస్ట్స్ ద్వారా కన్ ఫామ్ చేసారు. అయితే అదంతా గతం, సంధ్య థియేటర్ తొక్కిసలాట, ఆ తర్వాత అల్లు అర్జున్ జైలు , మెగా, అల్లు కుటంబం మధ్య గ్యాప్ తగ్గించింది.

జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి వచ్చాడు. దీంతో చిరు, అల్లు కుటుంబం  మధ్య తగ్గుతూ వస్తోంది. అందులో భాగంగానే, మన శంకర వర ప్రసాద్ పై అల్లు అర్జున్ ప్రశంసలు అని చెప్పుకోవచ్చు. మన శంకర వర ప్రసాద్ గారు చూసిన అల్లు అర్జున్ సినిమాను బాస్ బస్టర్ అని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ట్వీట్ రాసుకొచ్చాడు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!