ఇప్పుడు పెద్దిపై ఇండస్ట్రీలో ఉన్న రూమర్స్, మరో సినిమా పై లేవు. ఒకోక్కటిగా రూమర్స్, లిస్ట్ ఓపెన్ చేస్తూ వెళ్దాం.  ముందుగా లేటెస్ట్ రూమర్ నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్దిలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, మృణాల్ ఠాకూర్. పెద్ది సరసన స్పెషల్ సాంగ్ చేయనుందట.

ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. మరో వైపు ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ , ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుని, ఏఆర్ రెహమాన్ కు సౌండ్ మిక్సింగ్ కోసం పంపారు అని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ పై మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. మార్చి27న ఈ చిత్రం విడుదల కావడం కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మార్చి 19న ధురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతుండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, పెద్ది పోస్ట్ పోన్‌ కు మించి మరో దారిలేదని,

మే 1న పెద్ది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ప్రస్తుతం పెద్ది పై జాతర సీన్స్ తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!