మల్టీస్టారర్ చేస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఆల్రెడీ, థియేటర్స్‌ లో చూపిస్తోంది. అంతకు ముందు త్రిబుల్‌ ఆర్ తో, రామ్ చరణ్, తారక్ కూడా తమదైన మల్టీస్టారర్‌ తో, టాలీవుడ్‌కు ఆస్కార్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే దారిలో యంగ్ హీరోస్, స్క్రీన్ షేరింగ్‌కు రెడీ అవుతున్నారు.

ముఖ్యంగా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి విజయంతో జోష్ మీదున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలోనే మరో మూవీ చేస్తాను. మంచి కథ రెడీ చేసుకుంటే, తాను మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అన్నాడు శర్వానంద్. తనకు ఇప్పటివరకు మల్టీస్టారర్ చేసే ఆలోచన లేకపోయినప్పటికీ, తన చిత్రంలో శ్రీవిష్ణు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయానని,

ఫ్యూచర్‌ లో శ్రీ విష్ణుతో కలసి మంచి మల్టీస్టారర్ చేస్తానని, టాలీవుడ్‌కు ప్రామిస్ చేసాడు శర్వానంద్. ఏది ఏమైనా వరుస ఫ్లాపులతో డీలా పడిన శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం బైకర్ అనే మూవీని అలాగే భోగి అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల మేకింగ్‌లో తెరకెక్కే కామెడీ మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!