యూపీఐ ద్వారా 2016 నుంచి ఆర్ధిక లావాదేవీలు ఎంత సులువుగా మారాయో తెల్సిందే. ఇప్పుడు అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ పేస్ ను, త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించనుంది. చిన్న, గ్రామీణ రుణ స్వీయకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా యూఎల్ ఐ పని చేయనుంది.ఆర్ బీ ఐ @ 90 గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలియజేశారు. దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, వినియోగదార్లకు చేరువ కావడమే లక్ష్యంగా వివిధ విధానాలు, ప్లాట్ ఫారాలను రూపొందించడంపై ఆర్ బీ ఐ పని చేస్తోందని శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలను విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గణనీయమైన ఆశావాదంతో ఆర్ బీ ఐ @100 వైపు ప్రయాణం సాగిస్తుంది అన్నారు.
ఇవి కూడా చదవండి..