యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం కోసం, కళ్లలో వత్తులేసుని ఎదురు చూస్తున్నారు , ఆయన అభిమానులు. ఎప్పుడు అరవింద సమేత.. ఎప్పుడు దేవర. మధ్యలో గ్లోబల్ ఫిల్మ్ త్రిబుల్ ఆర్ రిలీజైంది. తారక్ కు గ్లోబల్ స్టార్ రికగ్నీషన్ వచ్చింది . అది వేరే సంగతి. కాని ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ వచ్చి ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఆలోటును అంతా తీర్చేందుకు దేవర వస్తోంది. సరిగ్గా నెల రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దేవర దండయాత్ర మొదలు కానుంది. అందుకే యూనిట్ వన్ మంత్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ పేరుతో ప్రత్యేకమైన పోస్టర్ ను రిలీజ్ చేసింది. భయానికి దేవర చిరునామా అనే విధంగా పవర్ ఫుల్ గా ఉంది పోస్టర్. అనిరుథ్ స్వరపరిచిన పాటలు దేవరకు చాలా క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఇక ఈ నెల రోజుల పాటు సినిమాను నార్త్, సౌత్ అనే తేడా లేకుండా, దేవర స్వయంగా వచ్చి ప్రమోట్ చేస్తే, సినిమా రిలీజ్ రోజున పాన్ ఇండియా షేక్ కావడం ఖాయం. మూవీ నుంచి త్వరలోనే మూడో సింగిల్ రిలీజ్ కానుంది. ఈ పాట విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ ఇటీవలే మొత్తం పూర్తైంది. ప్రస్తుతం దర్శకుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి: