స్టార్ అయిపోవడం ఆలస్యం,వెంటనే అభిమానులు, ఒక నేమ్ పెట్టేస్తారు. ఈ మధ్య కాలంలో అమరన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివకార్తికేయన్ ను తమిళ ప్రజలు, చిన్న దళపతి అని పిలవడం ప్రారంభించారు. దళపతి అంటే విజయ్, చిన్న దళపతి అంటే విజయ్ తర్వాత ఆ స్థానంలో నిలిచిన నటుడు శివకార్తికేయన్ అని అర్థం. కాని శివకార్తికేయన్ తనని అలా పిలవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసాడు. దళపతి విజయ్ 30 ఏళ్ల నటనా అనుభవం ముందు తను చాలా చిన్న వాడిని అన్నాడు. అతని నుంచి నిత్యం స్ఫూర్తి పొందుతాను అన్నాడు. ఒక అజిత్ కూడా తనని అజిత్ కుమార్ లేదా ఏకే అని పిలవాలని, అంతే కాని తలా అని పిలవద్దు అని అభిమానులకు విజ్ఞప్తి చేసాడు. ఇక 2019 లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్స్ అభిమానులకు తనని పవర్ స్టార్ అని పిలవద్దూ అంటూ రిక్వెస్ట్ చేసారు. పవర్ లో లేనప్పుడు , రెండు చోట్లా ఓడిపోయినప్పుడు ఇక పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకూ అంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో విడుదలైన భీమ్లానాయక్ కు  పవర్ స్టార్ టైటిల్ లేకుండానే మూవీని విడుదల చేసారు. ఇక ఈ మధ్య కాలంలో నాని కూడా తనకు నేచురల్ స్టార్ అని పిలవ వద్దు అంటూ అభిమానులను కోరాడు. స్టార్స్ కు ఇలాంటి టైటిల్స్ చాలా బూస్ట్ , అభిమానులకు ఈ టైటిల్స్ తోనే అసలైన ఆనందం. అందుకే సుకుమార్ సైతం అల్లు అర్జున్ కు పుష్ప విడుదల సమయంలో ఐకాన్ స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. అంతకు ముందు అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే పేరుతో పిలిచేవారు అభిమానులు.

error: Content is protected !!