తమిళ సినీ చరిత్రలో మొదటిసారి, లేదా ఈ మధ్య కాలంలో మొదటిసారి, గతంలో ఇలా ఎన్నిసార్లు జరిగింది.. ఏ సినిమాకు జరిగింది అనేది తెల్సుకోవాలంటే, ముందు అమరన్ గురించి తెల్సుకోవాలి. కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా, దీపావళి పండక్కి అమరన్ అనే మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది.
రిలీజ్ కు ముందు మామూలు అంచనాలు కనిపించాయి. కాని దీపావళికి సినిమా రిలీజైన తర్వాత అమరన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి అమరన్ ను తెరకెక్కించిన విధానం ఈ సినిమాను కోలీవుడ్ దాటి టాలీవుడ్, మాలీవుడ్ , శాండల్ వుడ్ లో వసూళ్లు అందేలా చేసింది. దాంతో అమరన్ ప్రస్తుతం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
నిజానికి నెట్ ఫ్లిక్స్ నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 28 రోజుల్లో అనే నెల రోజుల లోపే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జరగాలి. కాని ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో బలంగా ఉండటం, మరికొన్ని రోజులు బాక్సాఫీస్ దగ్గర ఎదురు లేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ టైమ్ 35 రోజులకు మార్చింది. కోలీవుడ్ లో ఫస్ట్ టైమ్ ఓ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.