టైటిల్ చూసి ఇటీవలే విడాకులు తీసుకున్న ధనుష్ మళ్లీ ఆదిపురుష్ హీరోయిన్ క్రితి సనన్ తో ప్రేమలో పడ్డాడా అని డౌట్ పడకండి. ఎందుకంటే ధనుష్ నటించబోయే కొత్త చిత్రంలో హీరోయిన్ గా క్రితి సనన్ నటించబోతోంది. ధనుష్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటు తెలుగులో, అటు తమిళంలో, ఇంకో వైపు బాలీవుడ్ లో, హాలీవుడ్ లో కూడా చేస్తున్నాడు. ఇందులో ఏ చిత్రంలో ధనుష్ తో కలసి క్రితి స్టెప్పులేస్తుంది అంటారా..

ధనుష్ ప్రస్తుతం తెలుగులో కుబేర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తమిళంలో చాలా చిత్రాలు చేస్తున్నాడు అది వేరే సంగతి. అయితే హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ అనే దర్శకుడితో తేరే ఇష్క్ మే అనే చిత్రంలో నటించాల్సి ఉంది. చాలా కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లింది. హీరోయిన్ గా క్రితి సనన్ పేరు ఖరారు అయింది. ధనుష్ బాలీవుడ్ మూవీస్ లో హీరోయిన్స్ అనగానే ఎప్పుడూ కూడా స్టార్ హీరోయిన్స్ కనిపించడం కామన్ అయిపోయింది. రాంఝ్నా కోసం సోనమ్ కపూర్, అతరంగీ రే లో సారా అలీ ఖాన్, ఇప్పుడు తేరే ఇష్క్ మే లో క్రితి సనన్ నటిస్తోంది.

error: Content is protected !!