మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్కడ తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 16 అలాగే 17 తేదీల్లో ఎన్టీఏ కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను పవన్ కలసిన సమయంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన వలసిందిగా అమిత్ షా కోరినట్లు సమాచారం. అందులో భాగంగానే పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పవన్ మరాఠీలో మాట్లాడి ఆశ్చర్యపరుస్తారా అనేది చూడాల్సి ఉంది. పవన్ కు మరాఠీ కూడా వచ్చి ఉండటం , ఇప్పటికే ఓజీ టీజర్ లో మరాఠీలో డైలాగ్స్ చెప్పి ఉండటం తెల్సిందే.