
త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ లోపే చరణ్ మరో కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇందుకోసమే ప్రస్తుతం న్యూ లుక్ లోకి మారుతున్నాడు.
- చేతులు కలిపిన అగ్రశ్రేణి విద్యాసంస్థలు, విద్యావిధానంలో పెను మార్పులు
- మల్టీస్టారర్ చేస్తానంటోన్న శర్వా, కాకపోతే ఒక్కటే కండీషన్
- పెద్దిలోకి మరో పెద్ద హీరోయిన్, మరి జాన్వీ కపూర్
- చిరుపై బన్ని ప్రేమ, మెగా – అల్లు సెట్ అయిపోయినట్లేనా?
- పెద్ది కోసం రంగంలోకి పుష్పరాజ్ డైరెక్టర్?
- ఆదర్శకుటుంబం, త్రివిక్రమ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్?
- రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
- జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
- మార్చిలో రిలీజైన చిత్రానికి , ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బన్ని?
- ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
