ట్విటర్ లో బ్రిటన్ మీడియా సంస్థ ది గార్డియన్ కు 1.07కోట్ల మంది ఫాలో వర్స్ ఉన్నారు. అయితే ఇక పై మాత్రం ట్విటర్ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి న్యూస్ అప్ డేట్స్ ఇవ్వబోమని ఈ దిగ్గజ మీడియా సంస్థ తెలిపింది. అందుకు కారణం ట్విటర్ లో జాత్యహంకారం, కుట్రలతో పాటు కలవరపరిచే అంశాలు కనిపిస్తున్నాయని, అందుకే ఇకపై ఎక్స్ ( ట్విటర్)కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి:
అమెరికా ప్రభుత్వంలో మస్క్ కీలక బాధ్యతలు తీసుకోబోతున్న తరుణంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఎక్స్ ఓనర్ మస్క్ మాత్రం గార్డియన్ ఆరోపణల్లో నిజం లేదన్నాడు.