మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. మహాయుతి మంచి జోరు మీదుంది. 288 స్థానాలకు 200కి పైగా స్థానాల్లో భాజపా కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ దశలో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరూ అనే చర్చ మొదలైంది. భాజపా నేత ఫడణవీస్ కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని భాజపా ముఖ్య నేత ప్రవీణ్ ధరేకర్ ధృవీకరించారు. మరో వైపు బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్రకు పరిశీలకులను పంపేందుకు సిద్ధమవుతోంది. వారు మహాయుతి కూటమి నేతలతో చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరూ అనేది క్లారిటీ వస్తుంది. మహాయుతిలో బీజేపీ 149 స్థానాల్లో , శివసేన 81, ఎన్ సీ పీ 59 స్థానాల్లో పోటీకి దిగాయి