మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోన్న వేళ..ఏక్ నాథ్ షిండే రాజకీయల్లో నుంచి తప్పుకోవాలని ఉద్ధవ్ శివసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ప్రతిపక్షాలు డ్యూటీ ఎక్కాయి ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే షిండే చేసిన ప్రామిస్ ను జస్ట్ గుర్తు చేస్తున్నాం అంటున్నారు ఉద్ధవ్ వర్గం శివసేన నాయకులు. కొత్త ప్రభుత్వంలో మరోసారి సీఎం రేస్ లో ఏక్ నాథ్ షిండే ఉన్నారు. అందుకు తగ్గ మంత్రాగం ఆయన, ఆయన వర్గం చేస్తోంది. ఇదే సమయంలో ఉద్ధవ్ శివసేన వర్గం షిండే పై విమర్శలు మొదలు పెట్టింది.

తన వర్గం ఎమ్మెల్యేలో ఒక్కరు ఓడిపోయినా, రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాని గతంలో ఏక్ నాథ్ షిండే చేసిన వాగ్దానాన్ని ఉద్ధవ్ శివసేన వర్గం ఆయనకు మరోమారు గుర్తుచేస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో షిండే శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయగా, అందులో ఐదుగురు ఓడిపోయారు. అందుకే ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి షిండే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉద్ధవ్ శివసేన డిమాండ్ చేస్తోంది.

error: Content is protected !!